ముగించు

పట్టుపురుగుల పరిశ్రమ శాఖ

పట్టుపురుగుల పరిశ్రమ సమాచారం

పట్టుపురుగుల పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ, పెద్ద, చిన్న మరియు సన్నకార రైతులకు బాగా సరిపోతుంది. పట్టుపురుగుల పెంపకములో కుటుంబంలోని అందరూ పాల్గొనవచ్చు .పట్టుపురుగుల పెంపకం చేయటం ద్వారా రెండు ఏకరాలకి రూ 1,50,000 ఆదాయం పొందవచ్చు అంచనా ప్రకారం సంవత్సరానికి 5 పంటలు వేసుకోవచ్చు

పట్టుపురుగుల పెంపకము ప్రకాశం జిల్లాలో పరిచయం చేసినది 1980 వ సంవత్సరంలో ఇప్పుడు తాళ్ళూరు , అద్దంకి, బల్లికురువ, సంతమగులూరు , వెలిగండ్ల, పామూరు, కనిగిరి, పొదిలి, కె.కె.మిట్ల , మర్రిపూడి, మార్కాపురం, తర్లుపాడు, దోర్నాల, వై . పాలెం, త్రిపురాంతకం, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు, కంబం, మరియు గిద్దలూరు మండలాలలో పెంపకం జరుగుతుంది. ఎర్ర ఇసుక నేలలు పట్టుపురుగుల పెంపకము చేపట్టడానికి ఉత్తమమైనవి.

ప్రకాశం జిల్లాలో సెరికల్చర్ కార్యకలాపాల అభివృద్ధిని ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు పరిశీలిస్తున్నారు

  1. అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ , ఒంగోలు: ఒంగోలు మరియు కందుకూరు డివిజన్ల కార్యకలాపాలు అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ , ఒంగోలు వారి ఆద్వర్యంలో జరుగుతాయి.
  2. అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ , మార్కాపురం :- మార్కాపురం డివిజన్ల కార్యకలాపాలు అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ , మార్కాపురం వారి ఆద్వర్యంలో జరుగుతాయి.

ప్రస్తుతం జిల్లాలో 1196 మంది రైతులు మల్బరీ సాగుతో దాదాపు 2424 ఎకరాలు పట్టుపురుగుల పెంపకం చేస్తున్నారు.

జిల్లాలో డిపార్ట్మెంట్ యొక్క కూర్పు

సాంకేతిక సేవా కేంద్రాలు

సెరికల్చర్ కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి మరియు వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలపై సెరికల్చురిస్టులకు సాంకేతిక మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం అందించడానికి (4) సాంకేతిక సేవా కేంద్రాలు చీమకుర్తి, తాళ్ళూరు , గిద్దలూరు మరియు దోర్నాలలో స్థాపించబడ్డాయి..

మోడల్ మల్బరీ ఫామ్, గిద్దలూర్

గిద్దలూరు వద్ద మోడల్ మల్బరీ ఫామ్ 10.00 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది, అధిక దిగుబడినిచ్చే రకరకాల మల్బరీ వి 1 మొక్కలను ఉత్పత్తి చేసి మరియు పెంచి రైతులకు సరఫరా చేస్తుంది.

రైతులకు చావ్కి పురుగులను సరఫరా చేయడానికి కుంబం వద్ద ఉన్న జ్యోతి చావ్కీ పెంపకం కేంద్రం పేరుతో ఈ ఒక ప్రైవేట్ చావ్కీ పెంపక కేంద్రం ఏర్పాటు చేయబడింది .

సిల్క్ రీలింగ్ యూనిట్లు

రైతుల నుండి కోకూన్స్ ను కొనుగోలు చేయడం ద్వారా పట్టు నూలును ఉత్పత్తి చేయడానికి రెండు ప్రైవేట్ రంగ సిల్క్ రీలింగ్ యూనిట్లు బెస్తవారిపేట వద్ద స్థాపించబడ్డాయి.

మహాత్మా గాంధీ ఎన్ ఆర్ ఈ జి‌ ఎస్ తో ఏకీభవించటం

ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా టైప్ -1 మరియు టైప్ -2 పెంపక షెడ్ల నిర్మాణానికి మరియు సిడిపి, ఆర్కెవివై, సిఎస్ఎస్, ఎస్డిఎస్ వంటి డిపార్ట్‌మెంటల్ పథకాలతో పాటు మల్బరీ తోటల పెంపకానికి 3 సంవత్సరాలు ఆర్థిక సహాయం అందిస్తోంది

NREGS నుండి సహాయం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

భాగం పేరు ఆర్డీ వాటా డిపార్ట్మెంట్ వాటా లబ్ధిదారుల వాటా మొత్తం
టైప్ 1 షెడ్ 6.121 3.00 1.568 10.689
టైప్ 2 షెడ్ 5.259 2.00 0.722 7.98
ప్లాంటేషన్ ఒకటవ సంవత్సరం 0.35 0.105 0.045 0.50
రెండవ సంవత్సరం 0.33 nil 0.006 0.3368

2019-20 సంవత్సరానికి డిపార్ట్‌మెంటల్ పథకాలకు ఇప్పటి వరకు బడ్జెట్ రాలేదు