ముగించు

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ గురించి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆదేశముల మేరకు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధినీ/విద్యార్ధులకు వసతి గృహములు మరియు ఇతర పథకముల ద్వారా అనగా బిసి న్యాయవాడులకు స్టైఫండ్, వెనుకబడిన తరగతుల వర్గాల వారికి (11) సహకార సంఘములకు రిజిష్ట్రేషన్, ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడుయేషన్ చేయుచున్న వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల వారికి ఉపకారవేతనములు, ఫీజులు మంజూరుకు అవకాశము కల్పించుచూ అనేక సంక్షేమ కార్యక్రమములు అమలు చేయబడుచున్నవి.

వసతి గృహముల నిర్వహణ

ప్రకాశము జిల్లాలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు మొత్తము 24 వసతి గృహములు అనగా జిల్లా లోని ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక బాలుర కళాశాల వసతి గృహము మరియు ఒక కళాశాల బాలికల వసతి గృహము మంజూరు చేసియున్నారు. వీటిలో 20 వసతి గృహాలు అద్దె భవనములలో నిర్వహించబడుచున్నవి. సదరు వసతి గృహములలో విద్యార్ధిని /విద్యార్ధులకు చేర్చుకొనుటకు 2400 సీట్లు మంజూరు చేయగా , ప్రస్తుతము 2387మంది విద్యార్ధిని/విద్యార్ధులు చేరియున్నారు.

సిబ్బంది

జిల్లా బిసి సంక్షేమ శాఖాదికారి ,ప్రకాశం జిల్లా ,ఒంగోలు వారి పరిదిలో (05)గురు సహాయ బిసి సంక్షేమాదికారులు పని చేయుచున్నారు

  1. సహాయ బిసి సంక్షేమాదికారి ,ఒంగోలు
  2. సహాయ బిసి సంక్షేమాదికారి ,చీరాల
  3. సహాయ బిసి సంక్షేమాదికారి ,కందుకూర్
  4. సహాయ బిసి సంక్షేమాదికారి ,మర్కాపురం
  5. సహాయ బిసి సంక్షేమాదికారి ,గిద్దలూరు

వసతి గృహ సంక్షేమాధికారులు ( ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు )

  1. జిల్లా లోని మొత్తము వసతి గృహములు -100
  2. జిల్లా లో పనిచేయుచున్న వసతి గృహ సంక్షేమాధికారులు -83
  3. జిల్లా లో మొత్తము వసతిగృహ సంక్షేమాధికారులు ఖాళీలు -17

వసతి గృహ సంక్షేమాధికారులు మరియు సిబ్బంది పనివేళలు

వసతి గృహ సంక్షేమాధికారులు : ఉదయం 6.00 AM to 9.00 AM ,మద్యాహ్నము 12.30 PM to 1.30 PM
వంటమనిషి :ఉదయం 5.30 AM to 9.00 AM , మద్యాహ్నము 11.30 PM to 2.00 PM
అటెండర్ / కామాటి /వాచ్ మెన్ : ఉదయం 6.00 AM to 7.00 AM,సాయంత్రం6.00 PM to 8.00 PM

10వ తరగతి పరీక్షా పలితాలు (2011-12 నుండి 2018-2019 వరకు)

వ. సంఖ్య సంవత్సరము హాజరైన విద్యార్ధులు ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఉత్తీర్ణత శాతం జిల్లా ఉత్తీర్ణత శాతం నూరు శాతము ఉత్తిర్ణత సాదించిన వసతి గృహములు
1 2011-2012 1379 1232 89.34% 87.34% 26 Hostels
2 2012-2013 1176 1044 88.77% 86.66% 22 Hostels
3 2013-2014 973 887 91.16 % 87.56% 32 Hostels
4 2014-2015 1063 1004 94.4% 91.83% 43 Hostels
5 2015-2016 1148 1049 91.37% 90.59% 27 Hostels
6 2016-2017 1213 1132 93.32% 91.78% 35 Hostels
7 2017-2018 1295 1277 98.61% 97.93% 61 Hostels
8 2018-2019 1324 1300 98.18% 98.17% 57 Hostels

నోటు పుస్తకముల పంపిణి : 2019-20

వ.నెం నోటు పుస్తకముల రకములు వచ్చిన పుస్తకములు పంపిణి చేసిన పుస్తకములు
1 192 Pages long ( UR) 71900 71900
2 192 short (UR) ( UR) 4640 4640
3 192 Pages short (OSR) 3202 3202
4 192 Pages short (SR) 24029 24029
5 96 Pages short 625 625

2019-2020 విద్యా సంవత్సరములో నోటు పుస్తకములను వసతి గృహ విద్యార్ధిని/విద్యార్ధులకు పంపిణి చేయునిత్తము సంబందిత సహాయ బిసి సంక్షేమాదికరులకు పంపిణి చేయడమైనది.

2019-20 వ సంవత్సరములో దుస్తుల పంపిణి

2019-20 వ సంవత్సరమునకు మేనేజరు ,ఆప్కో ,సికింద్రాబాద్ వారి నుండి క్లాత్ (cloth)రావలసియున్నది. క్లాత్ వచ్చిన తరువాత DPC చే ఎంపిక అయిన ఏజెన్సిలకు క్లాత్ కుట్టు నిమిత్తము సహాయ బిసి సంక్షేమాదికారుల ద్వార పంపిణి చేయబడును. సహాయ బిసి సంక్షేమాదికారులు పనిచేయు ప్రదేశములోనే (4) నాలుగు జతల యునిఫారం దుస్తులు కుట్టించి ఆయా వసతిగృహ విద్యార్ధులకు పంపిణి చేయడం జరుగుతుంది

ప్రీ మెట్రిక్ వసతి గృహములకు సరపరా చేసిన మెటిరియల్స్

2018-19 వ సంవత్సరములో జిల్లా లోని ప్రభుత్వ బిసి వసతి గృహములకు ట్రంక్ బాక్స్ లు, రైస్ దబరాలు ,గ్రైండర్లు ,పూరి మూకుడులు, గరిటలు ,బేసిన్స్, ఇడ్లీ మేకర్స్ ,గ్యాస్ స్టవ్ లు , ప్లేట్లు ,గ్లాసులు మొదలనవి DPC చే అమోదించబడిన ఏజెన్సీ ద్వార కొనుగోలు చేసి విద్యార్ధులకు ఇవ్వబడినవి.

పోస్ట్ మెట్రిక్ వసతి గృహములకు సరపరా చేసిన మెటిరియల్స్ :

2018-19వ సంవత్సరములో జిల్లా లోని ప్రభుత్వ బిసి వసతి గృహములకు ఐరన్ రాక్స్ , రైస్ దబరాలు ,గ్రైండర్లు ,పూరి మూకుడులు,గరిటలు ,బేసిన్స్ ,ఇడ్లీ మేకర్స్ ,గ్యాస్ స్టవ్ లు ,మొదలనవి DPC చే అమోదించబడిన ఏజెన్సీ ద్వార కొనుగోలు చేసి విద్యార్ధులకు ఇవ్వబడినవి.

ప్రభుత్వ బి.సి. వసతి గృహ భవనములకు మరమ్మత్తులు :

2019-2020 ఆర్ధిక సంవత్సరమునకు గాను, ప్రభుత్వ ప్రీ మెట్రిక్ /పోస్ట్ మెట్రిక్ వసతి గృహ భవనముల మరమ్మత్తులకు గాను శ్రీయుత డైరెక్టర్ బిసి సంక్షేమ శాఖ, విజయవాడ వారు రు.40.18 లక్షలు విడుదల చేసియున్నారు. మరమ్మతుల అంచనా వ్యయము నిమిత్తం (estimates) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ APEWIDC ఒంగోలు వారికి పంపదమైనది. సంబంధిత estimates వచ్చిన పిదప శ్రీయుత జిల్లా కలెక్టర్ వారిచే పరిపాలన ఉత్తర్వులు తీసుకుని మరమ్మత్తుల పనులు చేపట్టబడును. మరియు 2019-2020 ఆర్ధిక సంవత్సరమునకు గాను బిసి రెసిడెన్సియల్ పారశాలల భవనముల మరమ్మత్తులకు గాను శ్రీయుత డైరెక్టర్ బిసి సంక్షేమ శాఖ, విజయవాడ వారు రు.18.22 లక్షలు విడుదల చేసియున్నారు. మరమ్మతుల అంచనా వ్యయము నిమిత్తం (estimates) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ APEWIDC ఒంగోలు వారికి పంపడమైనది. సంబంధిత estimates వచ్చిన పిదప శ్రీయుత జిల్లా కలెక్టర్ వారిచే పరిపాలన ఉత్తర్వులు తీసుకుని మరమ్మత్తుల పనులు చేపట్టబడును.

బి.సి.కులములకు చెందిన పట్టబద్రులైన న్యాయవాదులకు శిక్షణ:

వెనుకబడిన తరగతుల కులములకు చెందిన పట్టబద్రులైన న్యాయవాదులకు, న్యాయవాద శిక్షణ కొరకు ప్రతి సంవత్సరము (8) మంది అర్హులైన న్యాయవాదులకు మూడు సంవత్సరముల పాటు నెలకు రూ.1000/-ల చొప్పున స్టైఫండ్ మరియు సంవత్సరమునకు రూ.6000/-లు పుస్తకములకు/ ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తము మంజూరు చేయబడును. 2018-2019 సంవత్సరంనకు గాను శ్రీయుత జాయింట్ కలెక్టర్/చైర్మన్ వారిచే బి.సి.న్యాయవాద శిక్షణ కమిటీ వారు ఎంపిక చేసిన 04 గురు న్యాయవాదులు ఎంపిక కాబడినారు.

కులాంతర వివాహము చేసుకున్న దంపతులకు ప్రోత్సాహక బహుమతి-2018-19

కులాంతర వివాహము చేసుకున్న దంపతుల సంఖ్య మంజురైన మొత్తము
02 Rs.20,000/-

విదేశీ విద్యా విధ్యాధారణ పదకము 2018-19

కేటగిరి మంజూరైన విద్యార్ధుల సంఖ్య మంజూరైన మొత్తము
బిసి 26 231.31
ఇబిసి 37 285.00

బి.సి. కులముల వారి సహకార సంఘములకు రిజిస్ట్రేషన్:

ప్రభుత్వము వారు జిల్లాలో గుర్తింపు పొందిన వెనుకబడిన తరగతుల కులములకు చెందిన సహకార సంఘములకు రిజిస్ట్రేషన్ చేయవలసినదిగా సంబందిత మేనేజింగ్ డైరెక్టర్ ఆంద్ర ప్రదేశ్ హైదరాబాద్ వారి ద్వారా ఆదేశించియున్నారు. సదరు సహకార సంఘములు 1) రజక 2) నాయి బ్రాహ్మణ 3) వడ్డెర 4) బట్రాజు 5) కృష్ణ బలిజ 6) వాల్మీకి/బోయ 7) విశ్వబ్రాహ్మణ 8) కుమ్మరి/శాలివాహన 9) మేదర 10) నగర/ఉప్పర మరియు 11) కల్లు/గీత కార్మికుల సహకార సంఘములకు రిజిస్టరు/బి.సి. సంక్షేమ శాఖాధికారి, ఒంగోలు వారి ద్వార రిజిస్ట్రేషన్ చేసి సదరు నకళ్లను సంబంధిత లబ్దిదారులకు మరియు వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘము వారికి ఋణముల మంజూరు నిమిత్తము పంపబడుచున్నవి.

ఎ.పి.బిసి స్టడీ సర్కిల్

శ్రీయుత జిల్లా కలెక్టర్/ప్రెసిడెంట్ గారి ఉత్తర్వుల ప్రకారముగా మహాత్మా జోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ బిసి స్టడీ సర్కిల్ ను పాత రిమ్స్ హాస్పిటల్,ఒంగోలు నందు స్థాపించి ,నిర్వహించబడుచున్నది . ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారముగా సదరు బిసి స్టడీ సర్కిల్ నందు వివిధ కోర్సులకు అర్హులైన విద్యార్ధిని /విద్యార్ధులు అనగా BC/SC/ST/EBC వారికీ రేషియో ప్రకారముగా ఉచిత శిక్షణ ఇవ్వబడుచున్నది.

2018-19వ సంవత్సరములో మంజూరైన పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల వివరములు

స్కీము విడుదలైన నిధులు ఖర్చు లబ్ది దారుల సంఖ్య
బిసి ఉపకార వేతనములు 1560.04 1560.04 36785
బిసి ఫీజు రియంబర్స్మేంట్ 1560.04 1560.04 36785
ఇబిసి ఉపకార వేతనములు 426.00 426.00 16021
ఇబిసి ఫీజు రియంబర్స్మేంట్ 3736.32 3240.70 16021
కాపు ఉపకార వేతనములు 127.00 127.00 5670
కాపు ఫీజు రియంబర్స్మేంట్ 1110.43 1059.37 5670