ముగించు

మాలకొండ

మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం జిల్లాలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ప్రముఖ పుణ్యం క్షేత్రంతో పాటు, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే. మాలకొండ ఆలయానికి సీజన్‌లో ప్రతి శనివారం 5 వేలమంది, అన్‌సీజన్‌లో రెండువేలకు పైగా భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రకృతి సిద్థమైన ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. లక్ష్మీఅమ్మవారి వద్దకు వెళ్లేందుకు కొండపగిలి ఉంటుంది. ఎంతలావు వ్యక్తి అయినా వెళ్లే విధంగా ఉంటుంది. వలేటివారిపాలెం మండలంలోని మాలకొండలో శ్రీమాల్యాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రతిశనివారం భక్తులకు దైవదర్శనం ఉంటుంది. వేలాదిమంది భక్తులు సుదూరప్రాంతాల నుంచి మాలకొండకు వస్తారు.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి
  • మాలకొండ ముఖద్వారం
  • మాలకొండ దేవాలయం ప్రదేశం
  • మాలకొండ ప్రదేశాలు

ఎలా చేరుకోవాలి?:

విమానం ద్వారా

విమాన సర్విస్ లు లేవు

రైలులో

మాల కొండకి 75 కిలోమీటర్ల దూరంలో ఒంగోలు రైల్వే స్టేషన్ కలదు

రోడ్డు ద్వారా

మాలకొండ చేరుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. తూర్పు మార్గం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుండి కందుకూరు మరియు లింగసంముద్రం ద్వారా ఉంది. పడమర మార్గం ప్రకాశం జిల్లాలోని పామూరు నుండి.