విపత్తులను సమర్ధంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు శ్రీమతి వి.అనిత అన్నారు. ఈ దిశగా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ. ఆర్.గోపాలకృష్ణ, డి.ఆర్.ఓ.శ్రీ.బి.చిన ఓబులేసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రచురణ తేది : 05/12/2024


