వార్తలు & నవీకరణలు
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., గారు 19.12.2024 తేదీన గ్రీవెన్స్ హాల్ ప్రకాశం భవన్లో జిల్లా అభివృద్ధి పథకాల గురించి జిల్లా అధికారులందరితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
- 11.12.2024 న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి.ఏ.తమీమ్ అన్సారియా.I.A.S గారు.
- విపత్తులను సమర్ధంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు శ్రీమతి వి.అనిత అన్నారు. ఈ దిశగా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ. ఆర్.గోపాలకృష్ణ, డి.ఆర్.ఓ.శ్రీ.బి.చిన ఓబులేసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S. గారు, మరియు AP మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య గారు 29.11.2024 న మత్స్యకారుల శాఖలో అభివృద్ధి పనులను సమీక్షించారు.
- భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., ఉద్యోగులచే 26-11-2024న రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.