జనన ధృవీకరణ పత్రము
జనన ధృవీకరణ పత్రమును పొందుటకు రెండు విధానములు కలవు
- పౌర సాంఘిక భాద్యత
- ఆలస్య జనన ధృవీకరణము
పౌర సాంఘిక భాద్యత
ఈ విధానము నందు పౌరులు వారి వారి మునిసిపాలిటి/పంచాయితీ లలో వైద్యని ధృవీకరణ పత్రము సహాయముతో పొందవచ్చును. ఈ సదుపాయము బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు మాత్రమే ఎస్ ఎల్ ఏ పీరియడ్ 21 రోజులు. సేవరుసుము ౩౦/-
అంతర్జాల చిరునామా సంప్రధించు: http://www.ubd.ap.gov.in:8080/UBDMIS/
ఆలస్య జనన ధృవీకరణము
ఈవిధానము నందు పౌరులు దగ్గరలో ఉన్న ‘మీసేవ’ నందు జనన ధృవీకరణ ఒక సంవత్సరం తరువాత నైనా నమోదు చేయించుకోవచ్చును. ఏ ప్రభుత్వ అధికారిని ప్రత్యక్షముగా కలవనవసరం లేదు. దానికి ఈ క్రింది పత్రములు అవసరము.
- భౌతిక పత్రము
- పంచాయితీ లేదా మునిసిపాలిటి జారీ చేసిన నిర్లభ్యతా పత్రము
- రేషను కార్డ్ కాపీ
- పదవ తరగతి (ఎస్ ఎస్ సి ) మర్కుల ధృవపత్రము
- స్వయం ధృవీకరణ పత్రము
సదరు పేర్కొనిన సేవను ధరఖాస్తు పొందేవరకు కేటగిరి ‘బి’ నందు, పొందిన తరువాత కేటగిరి ‘ఎ’ గాను పరిగనించబడును.
పై విధముగా పౌరుడు తనకు అవసరమైన ధృవపత్రమును పొందవచ్చును.
మీ సేవా పోర్టల్ http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx
ఎల్ ఆర్ బి డి ధృవపత్రము రెవిన్యూ విభాగము నుండి పొందిన తరువాత మునిసిపాలిటికి గాని పంచాయితీకి గాని పౌరుడు వెళ్ళి జనన ధృవీకరణ పత్రమును పొందవచ్చును.
సంప్రధించు: http://www.ubd.ap.gov.in:8080/UBDMIS/
ప్రాంతము : మీసేవ సెంటర్లు | నగరం : ఒంగోలు | పిన్ కోడ్ : 523001