ముగించు

రిజర్వాయర్లు

    • గుండ్లకమ్మ ప్రాజెక్టు

గుండ్ల కమ్మ ప్రాజెక్టును 12.845 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మల్లవరం వద్ద 80 అడుగుల ఎత్తున గుండ్లకమ్మ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో 62,368 ఎకరాలకు, రబీలో 80,060 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 592 కోట్లతో ప్రాజెక్టును నిర్మించారు. 2008 నవంబరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. సాగునీరు కాక ఈ ప్రాజెక్టు ఒంగోలు , ఒంగోలు పరిసర ప్రాంతాలలోని 2,50,000 త్రాగునీరు అందిస్తుంది.

    • మోపాడు

మధ్యతరహా ప్రాజెక్టు మోపాడు రిజర్వాయరును  మన్నేరు పై 1906 -21 మధ్య నిర్మించారు 6.47.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 61 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు ఇదిప్రకాశం జిల్లాలోని పామూరు మండలం,  నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం మండలాలలోని   12,719 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది.