ముగించు

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ పిల్లల సర్వతోముఖాభివృద్ధ్హి కొరకు ఏర్పాటు చేయబడిన సంస్థ అతి పెద్దకార్యక్రమమైన సమగ్ర శిశు అభివృద్ధి సేవా పధకం (ఐ సి డి ఎస్ ) ద్వారా అనుబంధ పోషకాహారం ,వ్యాధి నిరోధక టీకాలు ఆరోగ్య సేవలు పూర్వ ప్రాధమిక విద్య వివిధ శాఖల సమన్వయము తో నిర్వహిస్తోంది సార్వత్రిక ఐ సి డి ఎస్ పధకం ద్వారా కిశోరి బాలికలకు అనుబంధ పోషకాహారం , బాలల హక్కుల పరిరక్షణ ,గృహ హింస నుండి రక్షణ ,ప్రమాద పరిస్థితులలో ఉన్న బాలల ,మహిళల రక్షణ పునరావాసం లక్ష్యం గా పని చేస్తుంది .

ఐ.సి.డి. యస్

‘సమగ్ర అభివృద్ధి సేవా పథకం’ ఈ పథకము గర్భవతులు, బాలింతలు మరియు పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు 6సం. లోపు పిల్లల అభివృద్ధి కొరకు నిర్దేశించబడినది

అమృతహస్తం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమృతహస్తం పథకం ద్వారా గర్భవతులు, బాలింతలకు ప్రతి రోజు కోడి గ్రుడ్డు, 200 ml. పాలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనమును అంగన్వాడి కేంద్రములలో అందజేస్తున్నారు. ఈ పథకము యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలు బరువు తక్కువగా పుట్టుటను నివారించుట, గర్భవతులు, బాలింతలలో రక్తహీనతను నివారించుట ౩సం.-6సం.లోపు ప్రీ స్కూల్ పిల్లలను మద్యాహ్న భోజనం వారానికి 4 కోడి గ్రుడ్డ్లు అందించడం జరుగుతుంది. ఒక భోజనం ద్వారా గర్భవతులు బాలింతలకు 800 నుండి 1 ౦౦౦ కిలో కేలరీల శక్తి 10 నుండి 12 గ్రాముల ప్రోటీన్లు అందుతాయి .

బాలమృతం

7 నెల నుండి ౩ సం. పిల్లల కోసం గోదుమలు, శనగ పప్పు, పాలపొడి, నూనే మరియు పంచదారల మిశ్రమం విటమిన్లు, మినరల్స్ తో బలోపేతం చేయబడిన బాలమృతం పొడిని 2.5 కేజీల ప్యాకేట్ ను పిల్లల కొరకు టేక్ హోం రేషన్ గా ప్రతి నెల అందజేస్తారు. దీనితో పాటుగా నెలకు 8 కోడి గ్రుడ్డ్లు ఉడికించి అంగన్వాడి కేంద్రాలలో అందజేస్తారు.

గోరుముద్దలు

5 సం లోపు పిల్లలలో మోడరేట్ మరియు తీవ్ర లోపపోషణ గల పిల్లలను ఎత్తుకు తగిన బరువు లేని వారిని వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారిని గుర్తించి వారికీ 6 నెలల పాటు ప్రత్యేక పర్యవేక్షణ తో కూడిన అదనపు ఆహరం అందజేయటం జరుగుతుంది.

పోషణ్ అభియాన్

ఐసిడియస్ వ్యవస్థను బలోపేతం చేసి పిల్లలు, గర్భవతులు, బాలింతల పోషణస్తితిని మెరుగు పరచుట కొరకు ఏర్పాటు చేయటమైనది.

పోషణ్ అభియాన్ నందు గల భాగాలు

  1. ఐ.సి.డి. యస్ బలోపేతము మరియు సమాచార ప్రచార సాంకేతికత ఫై కార్యకర్తల సామర్ద్యము పెంచుట
  2. అబ్యాసాన్ని పెంపుదల చేయుట
  3. ప్రవర్తన మార్పుల కొరకు కమ్యూనిటీ ని ప్రేరేపించుట
  4. ప్రాజెక్ట్ నిర్వహణ, పర్యవేక్షణ మరియు మూల్యంకనం

ఈ పర్యవేక్షణ కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ (కాస్) స్మార్ట్ ఫోన్ లను అంగన్వాడి కార్యకర్తలకు అందించి వారిచే విషయ సేకరణ చేయించుట ద్వారా అమలు చేయబడుతున్నది

మహిళల కొరకు

గృహహింస నిరోధక చట్టం అమలు కేంద్రం

గృహహింస నిరోధక చట్టం 2005 అమలు కొరకు గృహహింస నిరోధక సెల్ జిల్లా కేంద్రము నందు ఏర్పాటు చేయబడింది దీని ద్వారా గృహ హింస ను ఎదుర్కుంటున్న మహిళలకు న్యాయ సహాయం, మరియు కౌన్సిలింగ్ నిర్వహించ బడుతున్నది. రాక్షనాదికారిగా ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ వారు వ్యవహరిస్తారు, లీగల్ కౌన్సిలర్, సోషల్ కౌన్సిలర్, మరియు ఇద్దరు హోం గార్డులు విధులు నిర్వహిస్తారు.

సఖి వన్ స్టాప్ సెంటర్(రిమ్స్ మెడికల్ హాస్పిటల్ 2వ అంతస్తు ఒంగోలు)

హింసకు గురైన స్త్రీలకు రక్షణ కల్పించి ఒకే చోట కౌన్సిలింగ్, వైద్య మరియు న్యాయ సహాయం అందచేస్తారు

ఫోన్ నెంబర్ : 08592-284506
మహిళా హెల్ప్ లైన్ : 181
పేస్ బుక్ పేజి :SAKHI Onestopcenter prakasam.face book.com

బాలల కొరకు

సమగ్ర బాలల సంరక్షణ పధకం

బాలల యొక్క సమగ్ర పరిరక్షణ మరియు వారి యొక్క హక్కుల ను కాపాడుట ప్రమాద పరిస్థితులలో ఉన్న బాలల రక్షణ పునరావాసం మరియు కుటుంబలో పునరేకికరణ చేయుట

జిల్లా బాలల పరిరక్షణ యూనిట్

(డి.సి.పియు) ప్రతి జిల్లా కేంద్రం నందు డి.సి.పియు ద్వారా పిల్లల పునరావాసం వివిధ శాఖల సమన్వయం తో నిర్వహించబడుతుంది

ఫోన్ నెంబర్ : 08592-239222

బాల సదనాలు

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ద్వారా అనాధ పాక్షిక అనాధ దారిద్య రేఖకు దిగువన గల కుటుంబాలలోని 6సం. – 11 సం బాలికలకు ఉచిత ఆవాసం మరియు విద్య అందించుట కొరకు ఏర్పాటు చేయబడినది. 6 వ తరగతి నుండి బాల సదనం నందలి బాలికలను సెకండరీ విద్య కొరకు కస్తూరిబా విద్యాలయాలలో చేర్చెదరు

ప్రకాశం జిల్లా నందలి బాల సదనలు : ఒంగోలు, గిద్దలూరు, కందుకూరు

శిశు గృహ : జువైనల్ జస్టిస్ యాక్ట్ 2000 ననుసరించి జిల్లా కేంద్రం లో శిశు గృహ 2005 సం.లో ఏర్పాటు చేయబడినది. వదిలి వేయబడిన, అనాధ శిశువు లను శిశు గృహ సంరక్షించి శిశు గృహ నందు సోషల్ వర్కర్, ఎయాన్.యం, చౌకిదారు మరియు 6 గురు ఆయాలు విధులు నిర్వహిస్తారు. 2010 సం. నుండి శిశు గృహ స్టేట్ ఎడప్షణ్ ఏజెన్సీగా అభివృద్ధి చేయబడినది మేనేజర్ కం ఎర్లీ చైల్డ్ లేర్నేర్ దత్తత ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

క్ర.స జిల్లా పేరు ప్రాజెక్ట్ పేరు సిడి.పి.ఓ పేరు ఫోన్ నెం సిడి.పి.ఓ పేరు ఫోన్ నెం
1 ప్రకాశం బేస్తవారి పేట శ్రీమతి .వై ధన లక్ష్మి 9491051619    
2 ప్రకాశం చీరాల శ్రీమతి. బి నాగమణి 9491051627    
3 ప్రకాశం గిద్దలూరు శ్రీమతి .ఎస్ కే రమీజా బానో 9491051614    
4 ప్రకాశం కందుకూరు(అ) వేకేంట్ 9491051628    
5 ప్రకాశం కనిగిరి వేకేంట్    
6 ప్రకాశం కొండేపి వేకేంట్ 9491051620
7 ప్రకాశం కొరిశపాడు శ్రీమతి ఏ ఎల్ వి ఎస్ కృష్ణ కుమారి 9491051621    
8 ప్రకాశం మద్దిపాడు శ్రీమతి సి హెచ్ భారతి 9491051617    
9 ప్రకాశం మర్కాపూర్(అ) శ్రీమతి జి లక్ష్మి దేవి 9491051626    
10 ప్రకాశం మర్కాపూర్(రూ) శ్రిమతి స్వరూప రాణి 9440814507    
11 ప్రకాశం ఒంగోలు(రూ) శ్రీమతి సి హెచ్ మల్లేశ్వరి 9440814510 శ్రీమతి టి శ్రీలత (నోడల్ ఆఫీసర్ /పి డి ఆఫీస్ ) 7799025664
12 ప్రకాశం ఒంగోలు(అ) శ్రీమతి పి సులోచన 9440814509    
13 ప్రకాశం పర్చూరు శ్రీమతి పి విజయ గౌరీ 9491051623
14 ప్రకాశం పొదిలి శ్రీమతి .యెన్ ఇందిరా కుమారి 9491051622    
15 ప్రకాశం సంతమాగులూరు శ్రీమతి డి విజయ లక్ష్మి 9491051624    
16 ప్రకాశం తాళ్ళూరు శ్రీమతి .కే వి పి రాజ కుమారి 9491051625    
17 ప్రకాశం తర్లుపాడు శ్రీమతి పి పద్మావతి 9491051615    
18 ప్రకాశం ఉలవపాడు శ్రీమతి బి మాధవిలత 9440814409    
19 ప్రకాశం వెలిగండ్ల శ్రీమతి బి లక్ష్మి ప్రసన్న 9491051618  
20 ప్రకాశం వేటపాలెం శ్రీమతి కే. ఉమ 9440814508  శ్రీమతి ,టి ఝాన్సీ  
21 ప్రకాశం ఎర్రగొండపాలెం శ్రీమతి పి పద్మావతి                (ఇన్ చార్జి ) 9440814432