ముగించు

సర్వ శిక్ష అభియాన్

ఆరు సంవత్సరాల వయసు నుండి పద్నాలుగేళ్ళ వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంద విద్యని ప్రాథమిక హక్కుగా చేస్తూ భారత రాజ్యాంగానికి చేసిన 86వ సవరణ నిర్దేశించినట్లుగా నిర్ణీత కాల పరిధిలో అందరికీ ప్రాథమిక విద్య అందిచటమే లక్ష్యంగా భారత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమమే సర్వ శిక్షా అభియాన్. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ ఈ కార్యక్రమానికి ఆద్యులు.

ఓ మధ్యంతర కార్యక్రమముగా 2000-2001 సంవత్సరం నుండి అమలుతున్నప్పటికి ఈ కార్యక్రమపు మొదలు అందరికి ప్రాథమిక విద్యనందించే లక్ష్యమే సాధనగా 1993-94 విద్యా సంవత్సరంలో ప్రాథమిక జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం DPEP వాటివని చెప్పవచ్చు.

DPEP కార్యక్రమం దేశంలోని 18 రాష్ట్రాలలోని 272 జిల్లాలలోను ఎన్నో దశల వారీగా విస్తరించింది. ఈ కార్యక్రమానికై అయ్యే ఖర్చులో 85% కేంద్ర ప్రభుత్వం , 15% రాష్ట్ర ప్రభుత్వం పంచుకోన్నాయి. ప్రపంచ ద్రవ్యనిధి (World Bank), DFID, UNICEF వంటి బాహ్య సంస్థలెన్నో కేంద్ర ప్రభుత్వ వాటా కోసం నిధులు సమకూర్చగా సుమారు 5 కోట్ల మంది పిల్లలని ఈ పథకంలోకి చేర్చటానికి 150 కోట్లకి అమెరికన్ డాలర్లు, మించిన ఖర్చు అయినది.

DPEP మొదటి దశలో ఈ కార్యక్రమ ప్రభావం ఎంతమేరకు ఎంతమందిపై దశ రూపకర్తలు అంచనా వేయగా చాల తక్కువ మంది పిల్లలపైనే ఈ కార్యక్రమ స్థూల ప్రభావం అమోఘంగా ఉందని బాలికలపై ఈ కార్యక్రమ ప్రభావం అంతగా పెట్టుబడి ఓ అనవసర ఖర్చు ఏమి కాదని, ఎందుకంటే ప్రాథమిక విద్యా పాఠశాలల మధ్యంతర కార్యక్రమాలకు కొత్త ఒరవడిని చుట్టినదని నిగ్గుతెల్చారు.

విద్యా హక్కు చట్టం ఏప్రిల్, 1వ తేది 2010 నాటి నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆమోదం పొందటం వల్ల SSA తన లక్ష్యాలను అమలు చేయటానికి చట్ట పరంగా కావలసినంత వూతం లభించిందని కొందరు విద్యావేత్తలు, విధాన కర్తలు నమ్ముతున్నారు.

ఈ శాఖ పాత్ర మరియు విద్యుక్త ధర్మాలు

అందరికి ప్రాథమిక విద్యనందించే కార్యక్రమమే సర్వ శిక్షా అభియాన్. తమ మానవ సమాజ సామర్ధ్యాలను మెరుగుపర్చుకోనటానికి పిల్లలందరికీ గుణాత్మకమైన విద్యను అందించడమే పనిగా పెట్టుకొని వారికి అవకాశం కల్గించటానికి చేసే ఓ ప్రయత్నమే ఈ SSA కార్యక్రమం. గుణాత్మకమైన ప్రాథమిక విద్యని దేశవ్యాప్తంగా అందించాలన్న మేధావుల, ప్రజల అభిలాషల ప్రతిస్పందనే ఈ SSA కార్యక్రమం.

SSA కార్యక్రమం ప్రధాన అంశాలు

 1. నిర్ణీత కాల చట్రంతో అందరికీ ప్రాథమిక విద్యనందించటం
 2. అందరికీ మెరుగైన ప్రాథమిక విద్యనందించాలని దేశ వ్యాప్తంగా కలిగిన కాంక్షలకు ప్రతిస్పందనే ఈ కార్యక్రమం.
 3. ప్ర్రాథమిక విద్య ద్వారా సామాజిక న్యాయాన్ని పెంపొందించే ఓ సువర్ణ అవకాశం ఈ కార్యక్రమం.
 4. దేశ వ్యాప్తంగా అందరికీ ప్రాథమిక విద్యనందించే ఇచ్చే వ్యక్తీకరణ ఈ కార్యక్రమం.
 5. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం
 6. ప్రాథమిక విద్యపట్ల తమ సొంత వైఖరిని, లక్ష్యాలను సాధించుకొనటానికి రాష్ట్రాలకు దక్కిన అవకాశం ఈ కార్యక్రమం.
 7. క్షేత్రస్థాయి నిర్మాణoలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నిర్వహణలో పంచాయత్ రాజ్ సంస్థలను, పాఠశాల నిర్వహణ కమిటీలను గ్రామీణ , నగర మురికివాడల స్థాయి విద్యా కమిటీలను, ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సంఘాలను, తల్లి-ఉపాధ్యాయునుల సంఘాలని గిరిజన స్వయంపాలక మండళ్ళని సమర్ధవంతంగా భాగస్వాములను చేసే ఓ ప్రయత్నమే ఈ కార్యక్రమo.

లక్ష్యాలు

 1. 6-14 సం|| వయస్సుగల పిల్లలoదరికీ ఉపయోగకరమైన ప్రాథమిక విద్యనందించటం
 2. పాఠశాలల నిర్వాహణలో సమాజ భాగస్వామ్యంతో లింగ, ప్రాoతీయ, సామాజిక అంతరాలను పూడ్చటం.
 3. పిల్లలు భౌతికంగా, ఆధ్యాత్మికంగా తమ అంతర్గత శక్తిని పెంపొందించుటకు వారి చుట్టూ ఉన్న పరిసరాలను తెలుసుకోనివ్వటం, పరిసరాలకు అలవాటు పడనివ్వటం.
 4. విలువ ఆధారిత విద్యనుపదేశించటం ద్వారా కేవలo తమ వ్యక్తిగత ప్రయోజనాలకన్న పరుల సంక్షేమం కోసం పనిచేసేలా పిల్లలికి అవకాసం కల్గించటం.
 5. జీవతం కోసం విద్య అనే భావనకి ప్రాధాన్యమిస్తూ సంతృప్తికరమైన మెరుగైన ప్రాథమిక విద్యనందిoచటంపై దుష్టి కేంద్రీకరించటం.

జిల్లలో అక్షరాస్యత రేటు (2011 జనాభా లెక్కలాదారంగా ):

అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ
మగ ఆడ మొత్తం మగ ఆడ మొత్తం మగ ఆడ మొత్తం మగ ఆడ మొత్తం
72.92 53.11 63.08 67.01 46.94 57.32 51.96 38.43 45.31 8.75 6.41 7.58

వనరులు (జనాభా 2011)
అత్యధిక అక్షరాస్యత సాధించిన మండలము : చీరాల (65.3%)
అత్యల్ప అక్షరాస్యత మండలము : త్రిపురాంతకం (41.8%)

జిల్లా స్వరూపంపై ఓ కన్నేద్దాం
క్రమ సంఖ్య సూచిక సంఖ్య
1 మండల వనరుల కేంద్రాలు 56
2 విద్యా డివిజన్లు 5
3 స్కూల్ సముదాయాలు/ క్లస్టర్ వనరుల కేంద్రాలు 342
4 కస్తురిభా గాంధీ బాలికా విద్యాలయాలు 37
5 నగరపాలికలు :1 + పురపాలికలు: 3 4
6 గ్రామాల సంఖ్య 1094
7 పంచాయితీలు 1028
8 మునిసిపల్ వార్డులు 129
9 ఆవాశాలు 2492
10 చదరపు కి||మీ కి జన సాంద్రత 193
11 లింగ నిష్పత్తి 981 : 971
12 జనాభా వృద్ధిరేటు 5 : 10
13 షెడ్యూల్ కులాల జనాభా 787861
14 షెడ్యూల్ తెగల జనాభా 151145
15 అల్పసంఖ్యాక వర్గాల జనాభా 239429

అమలు పథకాలు

 1. ఉపాధ్యాయులకు/ బడులకు విద్యా సంబంధమైన సహకారం
 2. సమాజ గతిశీలత కార్యక్రమాలు
 3. బడి బయట విద్యార్ధులకు ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు
 4. ప్రత్యేకావసరాలగల పిల్లలకు సమగ్ర విద్యనందించటం
 5. ప్రణాలికా విభాగం ఏర్పాటు
 6. బడులకు మౌలిక నిర్మాణ వసతులు కల్పించటం

చేపట్టిన కార్యకలాపాలు

 1. బడులకు / ఉపాధ్యాయులకు విద్యావిషయిక సహకారము అందించటం
 2. ప్రాథమికోన్నత పాఠశాలలకు అభ్యాసన సామగ్రి, గ్రంధాలలో పుస్తకాలు అందించటం
 3. మెరుగైన పర్యవేక్షణ కోసం స్కూల్ సముదాయాలను బలోపేతం చేయటం
 4. పాఠశాల నిర్వాహణ కమిటీలకు, మండల వనరు కేంద్రాలకు క్లస్టర్ వనరుల కేంద్రాలకు వార్షిక గ్రాంట్ లను అందజేయటం.

సమాజాన్ని చైతన్య వంతం చేసే కార్యకలాపాలు

 1. బడులలో చేర్పించే కార్యక్రమాలు నిర్వహించటం
 2. స్కూల్ నిర్వాహణా కమిటీల ఎన్నిక, వాటిని బలోపేతం చేసి కమిటీలోని సభ్యులకు జాగృతి కార్యక్రమాల సభలను నిర్వహించటం
 3. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే పిల్లలకు మూడు జతల ఏక రూప దుస్తులను అందిచటం. ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్ లు అందిచటం.
 4. విద్యా హక్కు పై మరియు అందరికి విద్యా కార్యక్రమం (SSA) పై కళాజాతరాలు , విద్యా విషయాల పట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం
 5. ప్రసార మాధ్యమాలలో ప్రచారం
 6. “బడి ఋణం తీర్చుకుందాం” వంటి కార్యక్రమాలలో స్కూల్ నిర్వహణలో సామాజిక చైతన్యం మరియు సహకారం అందిచటం.
 7. UNICEF ఆద్వర్యంలోని WASH IN SCHOOLS కార్యక్రమాల అమలు
 8. మండల, పాటశాల స్టాయిలో MHM అవగాహన, చైతన్య కార్యక్రమాలు

బడి బయట పిల్లలకు ప్రత్యామ్నాయ బోధనా సదుపాయములు

 1. బడి మానేసిన పిల్లలను గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టే ప్రణాళిక చర్యలు
 2. స్వల్ప కాలం పాటు బడి మానేసిన పిల్లలకు వసతి గృహేతర ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటం
 3. వలస కార్మికులకు పిల్లలకోసం స్వల్ప కాల వ్యవధి గల వసతి గృహాలు ఏర్పాటు చేయటం
 4. దూరవాస ప్రాంతాల పిల్లలను బడిలో చేర్పించడానికి రవాణా సౌకర్యాలు కల్పించటం

ప్రత్యేకావసరాలు కల్గిన పిల్లలకు ప్రత్యేక విద్య నందించుట

 1. ) ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించటం
 2. ఉపయుక్తమైన బోధనోపకరణాలు ఉపయోగించి బోధించే పద్ధతుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించటం
 3. అవసరమైన పిల్లలకు ఉపకరణాలు , పరికరాలను అందించటం
 4. కావాల్సిన పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరాలు ఏర్పాటు చేయటం
 5. CWSN కోసం ప్రత్యేక విద్యా కేంద్రాల నిర్వాహించటం
 6. అవసరమైన పిల్లలకు/ మాటలు పలకటం సరిగా రాని పిల్లలకు వాక్చిత్స (SPEECH THERAPY) నందించటం.
 7. NRSTC లకు హాజరగు పిల్లలకు రవాణా సౌకర్యాన్ని కల్పించటం
 8. సాధారణ పాఠశాల లకు హాజరయ్యే విద్యార్ధులకు కూడా తోడు పంపే సౌకర్యాన్ని కల్పించటం
 9. NGO సంస్థల భాగస్వామ్యంతో చిన్న చిన్న సర్దుబాటు శస్త్ర చికిత్సలవంటివి నిర్వహించటం.

ప్రణాళిక విభాగం

 1. విధ్య పై వకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (UDISE) ద్వారా సమాచార సేకరణ.
 2. వార్షిక కార్యాచరణ ప్రణాళిక బడ్జెట్ తయారీ.
 3. ఆధార్ సీడింగ్.
 4. కాల్ సెంటర్ల ఏర్పాటు.
 5. విద్యా విజువల్ CDలను అందించటం

బడులకు మౌలిక నిర్మాణ వసతులు కల్పనాs

 1. అదనపు తరగతి గదుల నిర్మాణం
 2. బాలురు, బాలకులకు వేర్వేరు మరుగుదొడ్లు నిర్మాణం మరియు CWSN మరుగుదొడ్లు నిర్మాణం
 3. మరుగు దొడ్లకు ప్రవాహ నీటి సదుపాయం కల్పించటం.
 4. తాగు నీటి సదుపాయం కల్పించటం
 5. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల లకు భారీ మరమ్మత్తులు చేయటం
 6. మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిర్వహణ ఖర్చులు చెల్లించటం

ఆడ పిల్లల కోసం అభివృద్ధి కార్యక్రమాలు

 1. బాల్య వివాహాలు, బాలికా సాధికారత, కెరియర్ మార్గదర్శకత్వం, ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం లపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
 2. అనాధలు, తండ్రి గాని, తల్లి గాని ఎవరో ఒకరు లేని బాలికల కోసం, OSC కోసం బడులు, మరియు కస్తురిబా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు).
 3. కౌమార దశలోని బాలికలలో వయస్సుతో వచ్చే మార్పుల అవగాహన కల్గించే జిల్లా స్థాయి ప్రత్యేక కార్యక్రమం ‘బాలికా తెల్సుకో’ అనే మధ్యంతర విధాన కార్యక్రమం నిర్వహించటం