ముగించు

జిల్లా పరిశ్రమల శాఖ

జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఒంగోలు, ప్రకాశం జిల్లా

పారిశ్రామిక ప్రగతి

  • జిల్లాలో గత నాలుగేళ్ళలో 17 భారీ మరియు మెగా తరహా పరిశ్రమలు 92  కోట్ల రూపాయల పెట్టుబడి తో స్థాపించి 5 వేలా 443 మందికి ఉపాధి కల్పించడమైనది.
  • 2036 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు 05 కోట్ల రూపాయల పెట్టుబడి తో స్థాపించి 24 వేలా 118 మందికి ఉపాధి కల్పించడమైనది.
  • ప్రస్తుతం జిల్లాలో 3 భారీ పరిశ్రమలు 67 కోట్ల రూపాయల పెట్టుబడి తో 545 మందికి ఉపాధి కల్పించుటకు నిర్మాణ దశలో ఉన్నవి.
  • సింగిల్ డెస్క్ పోర్టల్ విధానము ద్వారా జిల్లాలో గత నాలుగేళ్ళలో 3889 అనుమతులు మంజూరు చేసినందువలన 3636 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చి 22 వేల 115 మంది ఉపాధి పొందుటకు అవకాశము కలుగును.

రాయితీలు

  • జిల్లాలో గత నాలుగేళ్ళలో  5015 క్లెయిమ్ లకు గాను 477 కోట్ల రూపాయలు మంజూరు చేయుట జరిగినది.
  • 182 షెడ్యూల్డ్ కులముల క్లెయిమ్ లకు గాను52 కోట్ల రూపాయలు మంజూరు చేయుట జరిగినది.
  • 17 షెడ్యూల్డ్ తెగల క్లెయిమ్ లకు గాను76 కోట్ల రూపాయలు మంజూరు చేయుట జరిగినది.
  • గత నాలుగేళ్ళలో 1954 క్లైమ్ లకు సంబందించి 12 కోట్ల రూపాయల నగదు విడుదల చేయడమైనది.

  పరిశ్రమలు, సేవా రంగం – ప్రగతి, కార్యాచరణ

  • జిల్లాలో పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధి చెందుటకు చాలా అవకాశము ఉన్నది. విభజనతో ఆర్ధికంగా కష్టాలతో కూరుకుపోయిన రాష్ట్రాన్ని నాలుగో ఏడాదికే అద్బుత పురోగతితో పరుగులు పెట్టిస్తున్నాం.
  • 2016-17 సం.లో రాష్ట జి.వి.ఎ 4 లక్షల 92 వేల 374 కోట్లు సాధించేలా చేసాం. సేవల రంగం 2లక్షల 21 వేల  760 కోట్లు, పరిశ్రమల రంగంలో  1 లక్ష 30 వేల 509 కోట్లు జి.వి.ఎ నమోదైనది.
  • 2016-17 సం.లో ప్రకాశం జిల్లాలో జి.వి.ఎ 42 వేల 695 కోట్లు సాధించేలా చేసాం, అందు సేవల రంగం 3 వేల 581 కోట్లు, పరిశ్రమల రంగంలో 5 వేల 776 కోట్లు జి.వి.ఎ నమోదైనది.
  • 2016-17 సం.లో మొత్తం రాష్ట్ర వృద్ది రేటు 18 శాతం ఉంటే, సేవల రంగం 10.16 శాతం, పారిశ్రామిక రంగం 10.05 వృద్ది రేటు సాధించింది.