ముగించు

ఇంజనీరింగ్ పర్యాటక రంగం

గుండ్లకమ్మ ప్రాజెక్టు Gundla

గుండ్ల కమ్మ ప్రాజెక్టును 12.845 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మల్లవరం వద్ద 80 అడుగుల ఎత్తున గుండ్లకమ్మ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో 62,368 ఎకరాలకు, రబీలో 80,060 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 592 కోట్లతో ప్రాజెక్టును నిర్మించారు. 2008 నవంబరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. సాగునీరు కాక ఈ ప్రాజెక్టు ఒంగోలు , ఒంగోలు పరిసర ప్రాంతాలలోని 2,50,000 త్రాగునీరు అందిస్తుంది.

రాళ్లపాడు ప్రాజెక్టుrallapadu

జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులో రాళ్లపాడు జలాశయం ఒకటి. దీనిని కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలం, రాళ్ళపాడు వద్ద నిర్మించారు. 2202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 31.30 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద 16,500 ఎకరాలు అధికారికంగా, ఎనిమిదివేల ఎకరాలు అనధికారికంగా సాగవుతోంది. కుడికాలువ 20కిలోమీటర్లు పొడవున 14500 ఎకరాలకు , ఎడమకాలువ 3 కిలోమీటర్ల పొడవున 1500 ఎకరాలకు నీరందిస్తుంది.12.19×4.57m పరిణామంలోని 10 గేట్లతో పాత స్పిల్ వే ఉండగా , 12.19×7.62m పరిణామంలోని 5 గేట్లతో కొత్త స్పిల్ వే నిర్మించారు. తాగు, సాగునీటికి నెల్లూరు జిల్లాలోని కొండాపూరు, ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు , లింగ సముద్రం మండలాలకు కల్పతరువుగా పనిచేస్తోంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.