ముగించు

తీర్థయాత్ర పర్యాటక రంగం

మాలకొండ

malakonda

మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం జిల్లాలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ప్రముఖ పుణ్యం క్షేత్రంతో పాటు, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే. మాలకొండ ఆలయానికి సీజన్‌లో ప్రతి శనివారం 5 వేలమంది, అన్‌సీజన్‌లో రెండువేలకు పైగా భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రకృతి సిద్థమైన ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. లక్ష్మీఅమ్మవారి వద్దకు వెళ్లేందుకు కొండపగిలి ఉంటుంది. ఎంతలావు వ్యక్తి అయినా వెళ్లే విధంగా ఉంటుంది. వలేటివారిపాలెం మండలంలోని మాలకొండలో శ్రీమాల్యాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రతిశనివారం భక్తులకు దైవదర్శనం ఉంటుంది. వేలాదిమంది భక్తులు సుదూరప్రాంతాల నుంచి మాలకొండకు వస్తారు.

త్రిపురాంతక ఆలయం

Tripu

ఈ ఆలయాన్ని నిర్మించిన త్రిపురాసులు అనే రాక్షసులను లోక కల్యాణం కోసం శివుడు సంహరించాడు. ఈ ఆలయానికి గల మరో విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇదొక్కటే. స్వామివారి ఆలయం కొండ మీద ఉంటే, అమ్మవారి కోవెల సమీపంలోని చెరువులో ఉంది. అమ్మవారి ఆలయం పక్కన కదంబ వృక్షాలు పెరుగుతాయి. త్రిపురాంతకం, కాశీ మినహా మరెక్కడా ఈ చెట్లు లేవని లలితా సహస్రనామంలో పేర్కొన్నారు. శ్రీశైల తూర్పు ద్వారంగా పిలుచే త్రిపురాంతకం దేవస్థానాలు శ్రీశైల ఆలయ దత్తత కింద నడుస్తున్నాయి.

శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం

Chennakesawa swamy