ముగించు

కార్మిక శాఖ

ప్రకాశం జిల్లా నందు కల కార్మిక శాఖ ఉప కార్మిక కమీషనరు వారి నేతృత్వములో ఇద్దరు సహాయ కార్మిక కమీషనర్లు, ఇద్దరు సహాయ కార్మిక కమీషనర్లు (ఎస్‌. ఎస్‌. ఎస్) మరియు మరో 10 మంది సహాయ కార్మిక అధికారుల సహాయ సహకారాలతో పని చేయుచున్నది. అధికారుల వివరములు క్రింది తెలుపబడిన విధముగా ఉన్నవి.

సంయుక్త కార్మిక కమీషనరు, గుంటూరు జోన్,
( జోనల్ ప్రధాన కార్యాలయము గుంటూర్ నందు కలదు మరియు దాని పరిధిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలు కలవు.)
ఉప కార్మిక కమీషనరు, ఒంగోలు
1.సహాయ కార్మిక కమీషనరు, ఒంగోలు
2. సహాయ కార్మిక కమీషనరు,(ఎస్‌. ఎస్‌. ఎస్) ఒంగోలు
1.సహాయ కార్మిక కమీషనరు, కందుకూరు
2. సహాయ కార్మిక కమీషనరు,(ఎస్‌. ఎస్‌. ఎస్) మార్కపూర్.
1. సహాయ కార్మిక అధికారి -1, ఒంగోలు 1. సహాయ కార్మిక అధికారి , కందుకూరు
2. సహాయ కార్మిక అధికారి -2, ఒంగోలు 2. సహాయ కార్మిక అధికారి , కనిగిరి
3.సహాయ కార్మిక అధికారి -1, చీరాల 3.సహాయ కార్మిక అధికారి, కంభం
4. సహాయ కార్మిక అధికారి -2 , చీరాల 4. సహాయ కార్మిక అధికారి, మార్కాపురం
5. సహాయ కార్మిక అధికారి, పర్చూరు 5. సహాయ కార్మిక అధికారి, అద్ధంకి

కార్మిక శాఖ నిర్వర్తించు విధులు

 • పారిశ్రామిక శాంతిని కొనసాగించుట.
 • కార్మికుల వేతనాలు, బధ్రత, సంక్షేమం, పనిగంటలు, వారాంతపు మరియు ఇతర శెలవు దినాలు అమలు జరిగే విధంగా చూచుట.
 • కార్మికులకు చెందిన వేతనములు, బోనస్ లు మరియు గ్రాట్యుటీ మొదలగునవి సక్రమంగా అందేలా చూచుట.
 • వివిధ సంక్షేమ పధకములను అమలు చేయుట ద్వారా కార్మికుల యొక్క సంక్షేమ మరియు సామాజిక భద్రతను పెంపొందించుట.

కార్మిక శాఖ సాధారణ విధులు:

 • పారిశ్రామిక వివాదాలను పరిష్కరించుట ద్వారా సామరస్య పూర్వకమైన పారిశ్రామిక సంబంధాలు నిర్వహించేలా చూచుట మరియు రాజీ మరియు మధ్యవర్తిత్వ ప్రక్రియల ద్వారా న్యాయబద్ధమైన వేతనాలు వాటికి సంబందించిన సమస్యలు సకాలంలో పరిష్కరించుట.

 • ఆంధ్ర ప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు, మరియు అసంఘటిత కార్మికుల కొరకు నెలకొల్పబడిన ఆంధ్ర ప్రదేశ్ సామాజిక భద్రతా బోర్డుల యొక్క వివిధ పధకములను అమలుచేయుట ద్వారా కార్మికుల యొక్క సంక్షేమము మరియు సామాజిక భద్రతను పేంపొందించుట.

 • 22 కేంద్ర మరియు 4 రాష్ట్ర కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయుట ద్వారా భద్రత, సంక్షేమం, నిర్ధారిత పనిగంటలు, వారంతపు మరియు ఇతర శెలవు దినాలు, శెలవులు, ఉద్యోగ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు మొదలైనవి అమలు జరిగేలా చూచుట.

 • 73 షెడ్యూల్డు ఉపాధి కార్యకలాపాల నందు కార్మికులకు కనీస వేతనాలు, నష్ట పరిహారం, గ్రాట్యుటీ, బోనస్ మొదలైన సమస్యలకు సంబంధించిన పరిష్కార ప్రక్రియను నిర్వహించుట.
 • పాక్షిక న్యాయ ఉత్తర్వుల ద్వారా కార్మికులకు సంబంధించిన వేతనాలు, నష్టపరిహారం, గ్రాట్యుటి, బోనస్ మొదలైన సమస్యలకు సంబంధించిన పరిష్కార ప్రక్రియను నిర్వహించుట.
 • వివిధ సంస్ధలకు సంబంధించి నమోదు మరియు లైసెన్సింగ్ ప్రక్రియను నిర్వహించటంతో పాటు కార్మిక సంక్షేమ నిధిని వసూలు చేయుట.
 • ట్రేడ్ యూనియన్స్ నమోదు ప్రక్రియ నిర్వహించుట
 • బాల కార్మికులను గుర్తించుట మరియు విడిపించుట
 • వివిధ భవన మరియు ఇతర నిర్మాణ పనుల యొక్క కార్మిక సెస్ ను మదింపు చేసి వసూలు చేయుట.
 • భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులను నమోదు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయుట.

చట్ట పరమైన విధులు:

 • వివిధ కార్మిక చట్టాలను సక్రమంగా అమలు అయ్యేలా చూచుట
 • పారిశ్రామిక వివాదాల చట్టం ద్వారా రాజీ ప్రక్రియ నిర్వహించుట
 • కనీస వేతనముల చట్టం, వేతనముల చెల్లింపులు చట్టం, సమాన వేతనముల చట్టం, గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, ఆంధ్ర ప్రదేశ్ దుకాణముల సంక్షేమ చట్టం, ఉద్యోగుల నష్ట పరిహార చట్టం ద్వారా అర్ధ న్యాయ ప్రక్రియను నిర్వహించుట.

 • దుకాణములు మరియు సంస్ధలకు చెందిన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ ప్రక్రియ నిర్వహించుట.

శాఖ యొక్క ప్రధాన కార్యకలాపాలు:

ఈ క్రింది అంశములకు సంబందించిన సంక్షేమ మరియు సామాజిక భద్రతా పధకాలు అమలుచేయుట.

 1. ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు.
 2. ఆంధ్ర ప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు.
 3. ఆంధ్ర ప్రదేశ్ అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా బోర్డు.(SERP సంస్ధ ద్వారా YSR భీమా అమలు జరుపుట)
 1. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం, 2015 క్రింద వివిధ సంస్ధల యొక్క ఆన్ లైన్ నమోదు ప్రక్రియను ఈ క్రింది చట్టాలకు నిర్వహించుట.
  • ఆంధ్ర ప్రదేశ్ దుకాణములు మరియు సంస్ధల చట్టం, 1988
  • మోటార్ రవాణా కార్మికుల చట్టం, 1961
  • ఒప్పంద కార్మికుల (నియంత్రణ మరియు నిర్మూలన) చట్టం, 1970
  • గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972
  • బీడీ మరియు సిగార్ కార్మికుల చట్టం, 1966
  • భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం, 1996
 2. కనీస వేతనములు అమలు
 3. 73 షెడ్యూల్డ్ ఉపాధి కార్యకలాపాల నందు (65 పారిశ్రామిక అనుబంధ కార్యకలాపాలు మరియు 8 వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాలు) కనీస వేతనములు అమలు జరిగేలా చూచుట.

 4. కార్మికులకు నష్ట పరిహారం
 5. ఎంప్లాయూస్ కాంపెన్ సేషన్ చట్టం, 1923 క్రింద సహాయ కార్మిక కమీషనరు మొదలు కొని కార్మిక కమీషనరు వరకు కార్మిక నష్ట పరిహారానికి సంబంధించి కమీషనర్లుగా ప్రకటించారు.

 6. బాల కార్మిక నిర్మూలన
 7. బాల కార్మిక (నిషేదం మరియు నియంత్రణ) చట్టం, 1986 మరియు ఇతర బాల కార్మిక చట్టాలను బాల కార్మికుల నిర్మూలనకై కార్మిక శాఖ అమలు చేయుచున్నది

 8. ఈ క్రింది కార్మిక చట్టాలను అమలు పరచుట
  • వేతనాల చెల్లింపు చట్టము, 1936
  • ఆంధ్ర ప్రదేశ్ దుకాణములు మరియు సంస్ధల చట్టము, 1988
  • ఒప్పంద కార్మిక (నియంత్రణ మరియు నిర్మూలన) చట్టము, 1970
  • అంతరాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి, నమోదు మరియు సేవల షరతులు) చట్టము, 1979
  • ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ & స్టాండింగ్ ఆర్డర్స్ చట్టము, 1946
  • బీడీ మరియు సిగార్ కార్మికుల ( ఉపాధి షరతులు) చట్టము, 1966
  • బోనస్ చెల్లింపు చట్టము, 1965
  • మోటారు రవాణా కార్మికుల చట్టం, 1961
  • గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972
  • ట్రేడ్ యూనియన్ చట్టము, 1926

సంక్షేమ పధకముల వివరములు

ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ఈ క్రింది సంక్షేమ పధకముల ద్వార ఆర్ధిక సహాయము అందచేయబడుతుంది

 1. వివాహ కానుక పధకము – రూ.20,000/-
 2. విద్య ప్రోత్సాహం (స్కాలర్ షిప్) – రూ. 5000/- మరియు రూ.10,000/-
 3. వికలాంగులైన కార్మికుల పిల్లలకు – రూ.10,000/-
  విద్య ప్రోత్సాహం
 4. వైద్యసహాయం – రూ. 50,000/-
 5. ప్రమాద మరణము క్రింద ఆర్ధిక సహాయం – రూ. 5,00,000/-
 6. సహజ మరణము క్రింద ఆర్ధిక సహాయం – రూ. 20,000/-
 7. అంతక్రియలకు ఆర్ధిక సహాయం – రూ. 10,000/-
 8. అంగ వైకల్యమునకు ఆర్ధిక సహాయం – రూ. 10,000/-
 9. ప్రసూతి సహాయం – రూ. 20,000/-
 10. ఆదర్శ కుటుంబ ప్రోత్సాహం – రూ. 5000/-

ఆన్ లైన్ లింక్స్ వివరములు
http://www.labour.ap.gov.in
http://aplabourwelfareboard.ap.gov.in
https://apbocwwb.ap.nic.in/