ముగించు

భూగర్భజలము మరియు జలగణనశాఖ

శాఖ నేపద్యం

భూగర్భజలము మరియు జలగణనశాఖ (గతములో భూగర్భజల శాఖ) ను మొట్టమొదటగా 1981లో ఒంగోలు పట్టణము నందు జిల్లా క్యాంపు ఆఫీస్ గా జూనియర్ హైడ్రాలజిస్ట్ వారి ఆధ్వర్యములో ప్రారంభించియున్నారు. ఈ కార్యాలయమును నీటిపారుదల మరియు ఆయకట్టు శాఖ వారి ఉత్తర్వుల మేరకు 1996 వ సంవత్సరములో ఉపసంచాలకులవారి కార్యాలయముగా హెచ్చించడమైనది. అప్పటి నుండి ఉపసంచాలకులవారి కార్యాలయముగా పరిగణించడమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జలవనరుల శాఖ వారు ఈ శాఖను భూగర్భజలము మరియు జలగణనశాఖగా 2016 పేరు మార్చియున్నారు.

పరిపాలనా విభాగము:

ఈ కార్యాలయము ఉపసంచాలకులవారి సారధ్యములో సహాయ సంచాలకులవారు, సాంకేతిక అధికారులు మరియు ఇతర సిబ్బంది సహకారముతో పనిచేయుచున్నది.

ground water

విధులు

సమగ్ర హైడ్రోజియలాజికాల్ మరియు భూభౌతిక సర్వే లను నిర్వహించి భూగర్భజలము అధిక ప్రాంతములను గుర్తించుట మరియు నీటిపారుదల కొరకు అభివృద్ధి సంస్థలైన ఎస్.సి కార్పోరేషన్, బి..సి కార్పోరేషన్, ఎస్.టి. కార్పోరేషన్ ద్వారా ఎస్.సి, ఎస్.టి రైతుల కొరకు, సన్నకారు, చిన్నకారు రైతుల కొరకు మరియు పరిశ్రమల కొరకు అనువైన బోరుబావుల ప్రదేశములను గుర్తించుట .

  • భూగర్భజల నీటి మట్టములను పీజో మీటర్ల నుండి ఆటోమాటిక్ వాటర్ లెవెల్ రికార్డర్స్/టెలీమెట్రి సహాయముతో సేకరించుట మరియు నీటి నమూనాలను సేకరించి నీటి లక్షణములను తెలుసుకొనుట.
  • ఎస్.సి.సి. మరియు ఎస్.టి.సి. నిధుల ద్వారా ఎస్.సి, ఎస్.టి రైతుల పొలములలో అన్వేషనాత్మక ఉత్పత్తి బోరు బావులను నిర్మించుట.
  • భూగర్భజలము తక్కువ ఉన్న ప్రాంతములలో కృత్రిమ నీటి రీచార్జ్ కట్టడములను నిర్మించుటకు అనువైన ప్రదేశములను గుర్తించుట.
  • వర్షపు నీటి సేకరణ నిర్మాణాలకు సంబంధించి అనువైన ప్రదేశములను గుర్తించుట (RWHS).
  • జిల్లాకు సంబంధించిన భూగర్భ జల వనరులను గ్రామాల వారీగా మరియు పరివాహక ప్రాంతాల వారీగా అంచనా వేయుట.
  • ఉపరితల జలము మరియు భూగర్భజలాల సంయుక్త వినియోగము.
  • భూగర్భజలాల పై ఇసుక త్రవ్వక ప్రభావమును పరిశీలించుట.
  • పరిశ్రమలకు, మౌలిక వసతులకు మరియు మైనింగ్ ప్రాజెక్ట్ లకు భూగర్భజలాలకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చుట.
  • మంచినీటి చేపల చెరువులకు డిపార్టుమెంటల్ క్లియరెన్స్ ఇచ్చుట.

 

సహాయక ప్రాజెక్ట్ లు:

హైడ్రా లజి ప్రాజెక్ట్

ఆక్విఫెర్ ల స్వభావము మరియు మీటి మట్టముల హెచ్చు తగ్గులను తెలుసుకొనుటకు హైడ్రా లజి ప్రాజెక్ట్ ద్వారా పీజోమీటర్లను నిర్మించుట జరిగినది. ప్రస్తుతము టెలీమెట్రీ సహాయముతో Real time ground water level monitoring చేయడంజరుగుతున్నది. దీనికి సంబంధించిన డేటా ను మనము సి.ఎం.డ్యాష్ బోర్డు లో చూడవచ్చును.

ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు మరియు వ్యవసాయ పరివర్తన పధకము (APIIATP):

ఈ పధక ప్రధాన ఉద్దేశ్యము చెరువు ఆయకట్టులోని చిన్న, సన్నకారు రైతుల యొక్క వ్యవసాయ ఉత్పాదకత, లాభదాయకతను పెంచడం మరియు వాతావరణ వైవిద్యాలను ఎదుర్కొనే శక్తిని రైతులకు కలిగించుట. ఈ పధకము తరపున మెట్ట ప్రాంతపు మండలాలలో 87 చెరువులను గుర్తించి అనుబంధ ప్రభుత్వ విభాగముల ద్వారా వాటిని అభివృద్ధి చేయగలరు.

వివరముల కొరకు సంప్రదించవలసిన చిరునామా:

ఉపసంచాలకులు
భూగర్భజలము మరియు జలగణనశాఖ
డోర్.58-9-20, కామశాస్త్రి వీధి,
సంతపేట,
ఒంగోలు.
ఫోన్ నెం.: 08592 233118
సెల్.నెం.: 8333991219
ఫ్యాక్స్ నెం.: 08592 221434
ఈ-మెయిల్: ddgwd.ongole@yahoo .com